అక్షరటుడే, ఎల్లారెడ్డి: గ్రామంలో బెల్ట్ షాపులు నిర్వహిస్తే జరిమానా విధిస్తామని లింగంపేట మండలం పోతాయిపల్లి గ్రామస్థులు తీర్మానం చేశారు. శుక్రవారం గ్రామంలో సమావేశమై మద్యం విక్రయాలను చేపట్టొద్దని నిర్ణయం తీసుకున్నారు. కాగా.. మండలంలోని మెంగారం, శెట్పల్లి సంగారెడ్డి గ్రామాల్లో ఇదివరకే మధ్య నిషేధం అమలు చేస్తున్నారు.