అక్షరటుడే, వెబ్ డెస్క్: గ్రూప్-1 ఫలితాల విడుదలకు మార్గం సుగమం అయ్యింది. గ్రూప్-1 పై దాఖలైన రెండు పిటిషన్లను సుప్రీం కోర్టు కొట్టేసింది. ఫలితాల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
గ్రూప్-1 నియామకాలపై గతంలో కొందరు అభ్యర్థులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. రిజర్వేషన్లు తేలేంత వరకు గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు ప్రకటించొద్దని విజ్ఞప్తి చేశారు. 2024 డిసెంబర్ 26 వాదనలు విన్న హైకోర్ట్.. గ్రూప్-1 పరీక్షల నిర్వహణలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. దీంతో అభ్యర్థులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన సుప్రీంకోర్టు గ్రూప్-1పై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. ఇక ఫలితాల విడుదలే తరువాయి.