అక్షరటుడే, ఎల్లారెడ్డి: మాసానిపేట్ లోని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో ఆదివారం అమ్మవారి కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఆలయ 18వ వార్షికోత్సవ సందర్భంగా ఉదయం నుంచే అమ్మవారికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం జమదగ్ని రేణుక ఎల్లమ్మ విగ్రహాల ఊరేగింపు నిర్వహించి కల్యాణం జరిపించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు.