అక్షరటుడే, వెబ్ డెస్క్: తెలంగాణ స్టాఫ్ నర్స్ ఉద్యోగాల రాత పరీక్షలు శనివారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే 2,050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 17వ తేదీన పరీక్ష జరగాల్సి ఉండగా, 23వ తేదీకి మార్చారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు.