అక్షరటుడే, వెబ్డెస్క్: ఏపీలోని నెల్లూరు జిల్లాలో జికా వైరస్ కలకలం రేపుతోంది. జిల్లాలోని మర్రిపాడు మండలం వెంకటాపురం గ్రామంలో ఆరేళ్ల బాలుడికి జికా వైరస్ సోకినట్లు తెలుస్తోంది. మొదట బాలుడికి నెల్లూరు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. వైరస్ వచ్చినట్లు నిర్ధారణ అయ్యాక అతడిని చెన్నైలోని హాస్పిటల్కు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బృందం వెంకటాపురంను సందర్శించనుంది.