అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: నగరంలోని నాలుగో టౌన్ పరిధిలో డిప్యూటీ తహసీల్దార్ ఇంట్లో చోరీ జరిగింది. శ్రీ సాయి లక్ష్మీ నగర్ కు చెందిన జగదీశ్వరి తన కుమారుడికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో హైదరాబాద్ కు వెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉండడంతో దొంగలు బుధవారం అర్ధరాత్రి చొరబడి రెండు తులాల బంగారం ఎత్తుకెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి చోరీ జరిగినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.