అక్షరటుడే, ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ కు చెందిన తాజుద్దీన్ ఇంట్లో చోరీ జరిగింది. తాజోద్దీన్ ఇంటికి తాళం వేసి వ్యక్తిగత పనులపై వెళ్లగా దొంగలు ఆదివారం రాత్రి సమయంలో ఇంటి తాళాలు పగులగొట్టి లోనికి చొరబడ్డారు. రూ.లక్ష నగదు, పది తులాల బంగారు ఆభరణాలు అపహరించినట్లు బాధితులు తెలిపారు. ఘటనా స్థలాన్ని పట్టణ సీఐ సత్యనారాయణ పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.