అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్: నగరంలోని ఐదో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఐదో ఠాణా పరిధిలో గల బ్యాంక్ కాలనీలో నివాసం ఉంటున్న శ్రీనివాస్ కుటుంబం హైదరాబాద్‌కు వెళ్లగా.. సోమవారం రాత్రి దొంగలు ఇంట్లో చొరబడ్డారు. బెడ్‌రూంలో బీరువాలో దాచి ఉంచిన పది తులాల బంగారం, రూ.లక్ష నగదు అపహరించుకెళ్ళారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై గంగాధర్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.