అక్షరటుడే, హైదరాబాద్: రాష్ట్రంలో టెట్ ఫలితాల విడుదలపై సందిగ్ధత నెలకొంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ కారణంగా ఫలితాలను విడుదల చేయలేని పరిస్థితి ఉంది. ఫలితాల విడుదల కోసం ఈసీకి లేఖ రాయాలని విద్యాశాఖ యోచిస్తోంది. ఈసీ నిర్ణయం ఆధారంగా టెట్‌ ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది.