అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: శ్రీశైలం ఎడమ కాలువ(ఎస్‌ఎల్‌బీసీ) సొరంగంలో గల్లంతైన 8 మంది ఆచూకీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రెస్క్యూ బృందాలు టన్నెల్‌లో కూలిపోయిన ప్రాంతానికి చేరుకున్నప్పటికీ గల్లంతైన వారి ఆచూకీ కనుగొనలేకపోతున్నారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందం రంగంలోకి దిగి ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగిస్తోంది. రెస్క్యూకు సంబంధించిన ఫొటోలు, వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారాయి.