అక్షరటుడే, ఆర్మూర్: కమ్మర్‌పల్లి మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. హాసాకొత్తూర్‌ రోడ్డులోని ఓ ఇంట్లో నివాసముంటున్న శ్రీలేఖ ఈనెల 16న ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లారు. బుధవారం ఉదయం వచ్చి చూడగా.. తాళం పగులగొట్టి ఉండడంతో పోలీసులకు సమాచారమిచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బీరువాలో నుంచి అర తులం బంగారం, 18 తులాల వెండి ఆభరణాలు, నగదు అపహరణకు గురైనట్లు బాధితురాలు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ నవీన్‌కుమార్‌ తెలిపారు. అలాగే గ్రామంలోని శ్రీనివాస్, గణేశ్ ఇళ్లలోనూ చోరీకి యత్నించినట్లు సమాచారం.