అక్షరటుడే, బోధన్: పట్టణంలోని ఆచన్ పల్లిలో శుక్రవారం రాత్రి దొంగలు హల్చల్ చేశారు. ఓ మహిళ ఇంట్లో దొంగలు చొరబడి 5 తులాల బంగారం, 40 తులాల వెండి, రూ. 5వేల నగదు అపహరించుకుపోయారు. బోధన్ సీఐ వెంకట్ నారాయణ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.