అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: హైదరాబాద్‌లోని మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్‌ పాస్‌దారులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్‌ చెప్పింది. తమ దగ్గర ఉన్న బస్‌పాస్‌తో లహరి, రాజధాని, గరుడ ప్లస్‌, ఈ-గరుడ తదితర ఏసీ సర్వీసుల్లో ప్రయాణిస్తే టికెట్‌ పై10 శాతం రాయితీని ప్రకటించింది. తెలంగాణ, ఇతర రాష్ట్రాలకు వెళ్లే అన్ని టీజీఎస్‌ ఆర్టీసీ ఏసీ బస్సుల్లో ఈ 10 శాతం టికెట్‌ రాయితీ వర్తిస్తుందని తెలిపింది. మెట్రో ఎక్స్‌ప్రెస్‌, మెట్రో డీలక్స్‌, గ్రీన్‌ మెట్రో, ఎయిర్‌ పోర్ట్‌ పుష్పక్‌ బస్‌ పాస్‌దారులు ఈ రాయితీని పొందవచ్చని, వచ్చే ఏడాది జనవరి 31 వరకు ఇది అమల్లో ఉంటుందని తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్‌ వేదికగా ఈవిషయాన్ని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ పోస్టు చేశారు.