అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: దేశీయ స్టాక్ మార్కెట్లో బుధవారం లిస్ట్ అయిన మూడు ఐపీవోలు అదరగొట్టాయి. 279 రూపాయల బేస్ ప్రైస్ తో వచ్చిన మొబిక్విక్.. 57 శాతం ప్రీమియంతో 440 వద్ద లిస్ట్ అయింది. విశాల్ మెగా మార్ట్ ఐపీవో ధర 78 రూపాయలు కాగా 33 శాతం ప్రీమియంతో 104 వద్ద లిస్ట్ కాగా.. 549 రూపాయల బేస్ ప్రైస్ తో వచ్చిన సాయి లైఫ్ సైన్సెస్ 18శాతం ప్రీమియంతో 650 వద్ద లిస్ట్ అయింది. మూడు ఐపీవోలు తొలిరోజు ఇన్వెస్టర్లకు భారీ లాభాలను అందించాయి.