అక్షరటుడే, బోధన్: బోధన్ మండలంలో విషాదం చోటు చేసుకుంది. పెగడపల్లిలో కరెంట్ షాక్తో ముగ్గురు మృతి చెందారు. మృతులు ఒకే కుటుంబానికి చెందిన వారు. రెంజల్ మండలం సాటాపూర్ గ్రామానికి చెందిన గంగారాం, బాలమణి, కిషన్ షాక్ తో మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. అయితే రాత్రి సమయంలో వారు అక్కడికి ఎందుకు వెళ్లారనే విషయమై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.