అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్: నగరంలోని గంజ్ గోశాల వద్ద జరిగిన యువకుడి హత్య కేసులో ముగ్గురిని రిమాండ్‌కు తరలించారు. ఈ నెల 15న రాత్రి సమయంలో ఓ పాన్ షాపు వద్ద జరిగిన గొడవలో గైక్వాడ్ చంద్రకాంత్(22) మృతి చెందిన విషయం తెలిసిందే. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులు మనీష్‌కుమార్, సాయికృష్ణ, రుతిక్ గౌడ్లను అదుపులోకి తీసుకున్నారు. వీరిని బుధవారం కోర్టు ఎదుట హాజరుపర్చగా.. న్యాయస్థానం 14 రోజులు రిమాండ్ విధించినట్లు వన్‌టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపారు.