అక్షరటుడే, కామారెడ్డి: విలేకరిపై పరుష పదజాలం వాడిన కామారెడ్డి డీఎస్పీ నాగేశ్వర్ రావుపై చర్యలు తీసుకోవాలని అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డికి టీజేయూ, ఎన్ యూజే(ఐ) సంఘాల నాయకులు ఫిర్యాదు చేశారు. సదాశివనగర్ మండల రిపోర్టర్ రఫిక్ ఓ కేసు విషయంలో డీఎస్పీ వద్దకు వెళ్లి పరిచయం చేసుకోగా.. అసభ్య పదజాలంతో దూషించారని వివరించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బొక్కల వేణు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇలియాస్, కార్యదర్శి మధు, స్టేట్ కౌన్సిల్ మెంబర్ సాయిలు, శ్రావణ్, రఫిక్, నర్సాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.