అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: టీఎన్జీవోస్‌ అర్బన్‌, రూరల్‌ కార్యవర్గాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బుధవారం నగరంలోని టీఎన్జీవోస్‌ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు సుమన్‌ కుమార్‌ ఆధ్వర్యంలో ఎన్నిక ప్రక్రియ నిర్వహించారు. అర్బన్‌ యూనిట్‌ అధ్యక్షుడిగా జాకీర్‌ హుస్సేన్‌, కార్యదర్శిగా మారుతి, రూరల్‌ యూనిట్‌ అధ్యక్షుడిగా జ్ఞానేశ్వర్‌రెడ్డి, కార్యదర్శిగా శ్రీనివాస్‌ ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా సంజీవయ్య వ్యవహరించారు.