అక్షర టుడే, ఎల్లారెడ్డి: పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో శుక్రవారం టీఎన్జీఓస్ ఎల్లారెడ్డి తాలూకా క్యాలెండర్ ఆవిష్కరించారు. అధ్యక్షుడు లచ్చిగారి మహిపాల్ ఆధ్వర్యంలో ఆర్డీవో మన్నె ప్రభాకర్ చేతుల మీదుగా క్యాలెండర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి శరణ్, కోశాధికారి రవీందర్, ఉపాధ్యక్షులు రాజాగౌడ్, శ్రీకాంత్, వసంత లక్ష్మి, జాయింట్ సెక్రెటరీలు సంతోష్ రెడ్డి, అభినవ్ కుమార్, స్వాతి, ఆర్గనైజింగ్ సెక్రటరీ కృష్ణ, పబ్లిక్ సెక్రెటరీ శంకరయ్య, ఈసీ మెంబర్లు పాల్గొన్నారు.