అక్షరటుడే, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరో నారా రోహిత్ పెళ్లి పీటలెక్కబోతున్నాడు. ఇందులో భాగంగా శిరీష లెల్లతో ఆదివారం ఆయన ఎంగేజ్‌మెంట్ జరిగింది. హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో జరిగిన ఈవెంట్ కు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు దంపతులు, హీరో నందమూరి బాలకృష్ణ దంపతులు హాజరై ఈ జంటను ఆశీర్వదించారు. కాగా.. వీరిద్దరి వివాహానికి డిసెంబర్ 15న ముహూర్తం ఫిక్స్ చేసినట్లు సమాచారం.