అక్షరటుడే, హైదరాబాద్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కొత్త లుక్​తో దర్శనమిచ్చింది. తాజాగా తన ఇన్​స్టాగ్రామ్​ వేదికగా కొత్త ఫొటోస్ షేర్ చేసింది. ఈ ఫొటోల్లో సామ్ హాలీవుడ్ మోడల్ లుక్​తో కొత్తగా కనిపించింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమంత ఓ ప్రముఖ హాలీవుడ్ మ్యాగజైన్ కోసం ఈ కొత్త ఫోజులిచ్చినట్లు ప్రచారంలో ఉంది.

వెబ్ సిరీస్​లో అదరగొట్టి..

ఇటీవలే రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘సిటడెల్’లో సామ్ అదరగొట్టింది. గతేడాది డిసెంబర్​లోనే ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ పేరుతో సమంత బ్యానర్ ప్రారంభించింది. ఈ సంస్థలో నిర్మించబోయే మొదటి మూవీ ‘మా ఇంటి బంగారం’.