‘నిజాంసాగర్’ మీదకు పర్యాటకులకు నో ఎంట్రీ

0

అక్షరటుడే, జుక్కల్ : నిజాంసాగర్ ప్రాజెక్టు వరద గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతుండడంతో చూడడానికి పర్యాటకులు తరలి వస్తున్నారు. అయితే అధికారులు ప్రాజెక్ట్ మీదకు ఎవరినీ అనుమతించడం లేదు. ముందు జాగ్రత్తగా పోలీసులు డ్యాంపైకి పర్యాటకులను పంపించకపోవడంతో వారు నిరాశ చెందుతున్నారు. దూరం నుంచి నీటి విడుదలను చూసి గార్డెన్ లో సేదతీరుతున్నారు. నీటి విడుదల సమయంలో ప్రాజెక్టును చూడడానికి అనుమతించాలని కోరుతున్నారు.