అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: నగరంలోని వినాయక్​నగర్​ సబ్​స్టేషన్​ పరిధిలో మంగళవారం విద్యుత్​ సరఫరాలో అంతరాయం ఉంటుందని టౌన్​ ఏడీఈ వీరేశం తెలిపారు. చెట్ల కొమ్మలు తొలగిస్తున్నందున ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కరెంట్​ సరఫరా నిలిపివేస్తామని పేర్కొన్నారు. గాయత్రి నగర్ రోడ్ నంబర్ 1, 2, 3, 4, 5, ఆకుల పాపయ్య కాలనీ, చింత చెట్టు మైసమ్మ, కాశీనగర్, సిద్ధి వినాయక రోడ్, ఆర్యవైశ్య సంఘం, న్యాల్​కల్​ ప్రాంతాల్లో విద్యుత్​ ఉండదన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.