అక్షరటుడే, ఇందూరు : డీఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వెనిగళ్ల సురేశ్ డిమాండ్ చేశారు. శనివారం టీఎన్జీవోస్ భవన్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంఈవోలను తక్షణమే నియమించాలని, డైట్ బీఈడీ కళాశాలల్లో ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. ఉపాధ్యాయులకు సంబంధించిన మెడికల్ బిల్లులను నిలుపేయడంపై విచారం వ్యక్తం చేశారు. టీపీటీఎఫ్ బలపర్చిన అశోక్ కుమార్‌ను ఎమ్మెల్సీగా గెలిపించాలని తీర్మానించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా సత్యనారాయణ, ఉపాధ్యక్షులు చందర్, అరవింద్, హలీం, మల్కన్న, జిల్లా కార్యదర్శి మల్లేశం, గంగాప్రసాద్, నగేష్, కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.