అక్షరటుడే, ఇందూరు: సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు పూర్తి మద్దతు తెలుపుతున్నామని టీపీటీ ఎఫ్ జిల్లా అధ్యక్షుడు వెనిగళ్ల సురేష్ తెలిపారు. శుక్రవారం ఉద్యోగులు చేస్తున్న దీక్షలకు మద్దతు తెలుపుతూ మాట్లాడారు. ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ ప్రకటించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, సెలవులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీపీటీఎఫ్ ప్రధాన కార్యదర్శి అరవింద్ తదితరులు పాల్గొన్నారు.