నిజాంసాగర్, అక్షరటుడే: టీపీటీఎఫ్ కామారెడ్డి జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా చింతల లింగం, ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్ రెడ్డి ఎన్నికయ్యారు. అనంతరం కార్యవర్గ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు అనిల్ కుమార్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. నూతన కార్యవర్గ సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు సీహెచ్ లక్ష్మి, విజయశ్రీ, తృప్తి శ్రీనివాస్, హరిసింగ్, నరేందర్, గోపి, శ్రీనివాస్, సీహెచ్ ప్రకాశ్, కృష్ణ, కృష్ణమూర్తి, హరీశ్, కేఎన్ భగత్, రామాగౌడ్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.