అక్షరటుడే, కామారెడ్డి: మంత్రివర్గ ఉప సంఘం హామీ ఇచ్చిన విధంగా పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని టీపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్‌ కుమార్‌ ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని వశిష్ట డిగ్రీ కాలేజీలో టీపీటీఎఫ్‌ కామారెడ్డి జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు దాదాపుగా తొమ్మిది నెలలుగా పెండింగ్ లో ఉన్న బిల్లులను వెంటనే మంజూరు చేయాలన్నారు. 2024 మార్చి నుంచి ఉద్యోగ విరమణ చెందిన ఉపాధ్యాయుల పెన్షన్‌ బెనిఫిట్స్‌ ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. బిల్లుల విడుదలలో కూడా పైరవీలకు ఆస్కారం ఇచ్చే విధంగా కొన్ని సంఘటనలు వెలుగు చూడడం విచారకరమన్నారు. కార్యక్రమంలో సీహెచ్‌ లక్ష్మి, విజయశ్రీ, శ్రీనివాస్‌, హరిసింగ్‌, నరేందర్‌, గోపి, శ్రీనివాస్‌, ప్రకాశ్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.