అక్షరటుడే, ఎల్లారెడ్డి: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం సాంప్రదాయ వస్త్రాలంకరణ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు వివిధ రాష్ట్రాలకు చెందిన సంప్రదాయ వస్త్రధారణతో ప్రదర్శనలు నిర్వహించారు. తెలుగు శాఖ అధ్యక్షుడు వి శంకరయ్య మాట్లాడుతూ.. భారతదేశం విభిన్న సంస్కృతులకు నిలయమని, పరస్పర గౌరవంతో సామరస్యంగా జీవించాలన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఎం.చంద్రకాంత్, టీఎస్ కేసీ ఇన్ ఛార్జి శివకుమార్, నాగనిక, బి అరుణ్ కుమార్, డా గంగారెడ్డి, సిద్దిరాజు, గోదావరి, చంద్రకాంత్, శశిధర్, రాణి, మోహిన్, సంగీత, దశరథ్ మహమూద్, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

