అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: నగర శివారులోని మాధవ నగర్ రైల్వే గేట్ నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. సాంకేతిక లోపం కారణంగా గేటు తెరుచుకోవడం లేదు. దీంతో గత రెండు గంటల నుంచి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి.