అక్షరటుడే, నిజామాబాద్‌ సిటీ: నగరంలో ఆటోడ్రైవర్లు నిబంధనలు పాటించాలని ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ పి.ప్రసాద్‌ పేర్కొన్నారు. మంగళవారం ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌లో ఆటోస్టాండ్‌ యూనియన్‌ ప్రతినిధులు, ఆటోడ్రైవర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. ప్రతి ఆటోడ్రైవర్‌ ధృవీకరణ పత్రాలను తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని సూచించారు. రోడ్డు మధ్యలో పార్కింగ్‌ చేయవద్దని, ఎక్కువమంది ప్యాసింజర్లను ఎక్కించుకోవద్దన్నారు. ప్రతి ఆటోకు ఇన్సూరెన్స్‌ చేయించాలని చెప్పారు. మద్యం సేవించి ఆటోలు నడపవద్దని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్సై సుమన్‌, సిబ్బంది పాల్గొన్నారు.