అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ట్రాఫిక్‌ పోలీసులు అంబేద్కర్‌ విగ్రహానికి నివాళులర్పించారు. నగరంలోని పులాంగ్‌ చౌరస్తా వద్ద గల అంబేద్కర్‌ విగ్రహానికి ట్రాఫిక్‌ సీఐ వీరయ్య, ఎస్సై సంజీవ్‌ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ట్రాఫిక్‌ సిబ్బంది శేఖర్‌ బాబు, తదితరులు పాల్గొన్నారు.