అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: సినీ నటి సమంత కుటుంబంలో విషాదం నెలకొంది. ఆమె తండ్రి జోసెఫ్‌ ప్రభు కన్నుమూశారు. తండ్రి మరణంతో ఆమె తీవ్ర విచారంలో మునిగిపోయారు. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాలో పోస్ట్‌లో పెట్టారు. హృదయం ముక్కలైన ఎమోజీని షేర్‌ చేస్తూ.. ‘‘నాన్నా మళ్లీ మనం కలిసేంత వరకు’’ అని పేర్కొన్నారు. పలువురు నెటిజన్లు ఆమెకు ధైర్యం చెబుతున్నారు.