హైదరాబాద్, అక్షరటుడే: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన సోదరి సకలమ్మ మృతి చెందారు. తీవ్ర అనారోగ్యంతో సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి కన్నుమూశారు. కేసీఆర్ కు ఆమె ఐదో సోదరి. సకలమ్మ స్వగ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పెదిర గ్రామం. ఆమె భర్త హనుమంతరావు గతంలోనే మృతి చెందారు.