అక్షరటుడే, వెబ్‌డెస్క్: తెలంగాణలో మరో రెండు ఆర్టీసీ కొత్త డిపోలను మంజూరు చేసినట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆర్టీసీలో 10-15 సంవత్సరాల తర్వాత ఆర్టీసీ డిపోలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పెద్దపల్లితో పాటు ములుగు జిల్లాలోని ఏటూరు నాగారంలో నూతన డిపోలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఆర్డర్లు మంత్రులు సీతక్క, శ్రీధర్‌బాబులకు అందించనున్నట్లు చెప్పారు.