అక్షరటుడే, కామారెడ్డి: గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కామారెడ్డి పట్టణంలోని 47వ వార్డులో పెంకుటిళ్లు కూలుతున్నాయి. ఇప్పటికే 12 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వం తక్షణమే సాయమందించాలని బాధితులు కోరుతున్నారు. కొత్త ఇల్లు నిర్మించుకునేందుకు వీలుగా ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థిక సాయం చేయాలని స్థానిక కౌన్సిలర్ స్వప్న కోరారు.