అక్షరటుడే, వెబ్ డెస్క్: నిజామాబాద్ నగరంలో ఇద్దరు బాలికలు అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. మూడో టౌన్ పరిధిలో నివాసం ఉండే 9, 10వ తరగతి చదివే ఇద్దరు విద్యార్థినులు పెద్దలు మందలించడంతో తమ ఇళ్ల నుంచి బయటకు వెళ్లిపోయారు. అనంతరం కుటుంబీకులు వారి ఆచూకీ కోసం గాలించారు. ఎలాంటి సమాచారం లేకపోగా మూడో టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదృశ్య కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.
Advertisement
Advertisement