అక్షరటుడే, ఎల్లారెడ్డి: లింగంపేట మండల కేంద్రంలో సోమవారం రాత్రి రెండు ఇళ్లలో చోరీ జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కొత్వాల్ గల్లీకి చెందిన జావిద్ కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని బంధువుల ఇంటికి వెళ్లారు. దొంగలు తాళం పగలగొట్టి ఇంట్లోకి చొరబడి రూ.12 వేల నగదు, బంగారు ఆభరణాలు, విదేశీ వస్తువులు అపహరించారు. అదే గల్లీలో ఉండే పాషా తనయుడు రియాజ్ ఇంట్లో సైతం దొంగతనం జరిగింది. బంగారు ఆభరణాలు దొంగిలించారు. ఎస్సై సుధాకర్ ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.