అక్షరటుడే, ఎల్లారెడ్డి : లింగంపేట మండలంలోని ముస్తాపూర్, మెంగారం గ్రామ శివార్లలో సోమవారం రాత్రి అదుపుతప్పి రెండు లారీలు బోల్తా పడ్డాయి. లింగంపేట వైపు నుంచి కామారెడ్డి వైపు వెళ్తున్న మక్కల లారీ ముస్తాపూర్ మూలమలుపు వద్ద బోల్తాకొట్టగా.. లింగంపేట వైపు నుంచి ఎల్లారెడ్డి వైపునకు బియ్యం లోడుతో వెళ్తున్న లారీ మిద్దమేట్టు చెడావు వద్ద బోల్తా పడింది. లారీలు బోల్తా పడిన ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.