అక్షరటుడే, బాన్సువాడ : వర్ని మండలంలోని జలాల్ పూర్ శివారులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సైద్ పూర్ గ్రామానికి చెందిన ఇద్దరికి గాయాలయ్యాయి. ద్విచక్ర వాహనంపై జలాల్పూర్ నుంచి వర్ని వస్తుండగా మెగావత్ గబ్బర్ సింగ్, సంతోష్ లను ఎదురుగా వస్తున్న కారు ఢీకొంది. ఈ ఘటనలో గాయపడ్డ వారిని స్థానికులు నిజామాబాద్ జిల్లా హాస్పిటల్ కి తరలించారు.