అక్షరటుడే, వెబ్‌డెస్క్: జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో అస్వస్థతకు గురైన ఇద్దరు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించారు. గురుకులంలో గురువారం అర్ధరాత్రి తర్వాత ఒక విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. మరో ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురవడంతో నిజామాబాద్‌కు తరలించారు. వీరిలో హర్షవర్ధన్ జీజీహెచ్‌లో చికిత్స పొందగా, ఆడెపు గణేశ్ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించారు. అయితే విద్యార్థులకు పాము కరిచిందా.. లేదా మరేదైనా విషపు పురుగు కుట్టిందా అనే దానిపై స్పష్టత లేదు. అయితే శనివారం ఉదయం జగిత్యాల జిల్లా కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్ తదితరులు నిజామాబాద్ విద్యార్థుల పరిస్థితిని తెలుసుకున్నారు.