అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : మద్యానికి బానిసైన ఓ వ్యక్తి జీవితంపై విరక్తితో ఆత్మహత్యకు పాల్పడినట్లు టూ టౌన్ ఎస్ హెచ్ వో అరాఫత్ తెలిపారు. నగరంలోని లైన్ గల్లికి చెందిన షేక్ ఇమ్రాన్(30) పని చేయకుండా మద్యానికి బానిసగా మారాడు. ఈ క్రమంలో రెండురోజుల కిందట భార్యను పుట్టింటికి పంపాడు. సోమవారం మద్యం మత్తులో ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.