అక్షరటుడే, జుక్కల్: నాందేడ్ -అకోలా జాతీయ రహదారి నెత్తురోడింది. 161 హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. జుక్కల్ మండలం కౌలాస్ గేటు సమీపంలో గుర్తు తెలియని వాహనం గురువారం రాత్రి బైకును ఢీకొట్టింది. ప్రమాదంలో బిచ్కుంద మండలం పెద్దతక్కడ్ పల్లికి చెందిన ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు వంశీ(24), కార్తీక్ (27)గా గుర్తించారు. జుక్కల్ ఎస్సై భువనేశ్వర్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా.. ప్రమాదానికి కారణమైన వాహన డ్రైవర్ పరారీ అయినట్లు సమాచారం.