అక్షరటుడే, సిరికొండ: సిరికొండ మండలంలోని తూంపల్లి పంచాయతీ పరిధిలో గల ఎదురుకొండ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం నిర్వహించారు. వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ డీసీసీ ప్రధాన కార్యదర్శి వెలమ భాస్కర్ రెడ్డి, తుంపల్లి, కొండాపూర్, వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులు స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో రెండు గ్రామాల గ్రామ కమిటీ, ఆలయ కమిటీ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.