అక్షరటుడే, ఇందూరు: ఇంటర్ డిస్ట్రిక్ట్ సైక్లింగ్ పోటీలకు క్రీడాకారులను నవంబర్ 2న ఎంపిక చేయనున్నట్లు అసోసియేషన్ కార్యదర్శి విజయ్‌కాంత్‌రావు తెలిపారు. జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్-14 బాలబాలికలను ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు 2న ఉదయం 7 గంటలకు తమ సొంత రేసింగ్ సైకిల్, బర్త్ సర్టిఫికెట్‌తో కంఠేశ్వర్ బైపాస్ వద్ద రావాలని సూచించారు. ఎంపికైన క్రీడాకారులు వచ్చేనెల 4వ తేదీ నుంచి 6 వరకు జనగాంలో నిర్వహించే ఇంటర్ డిస్ట్రిక్ట్ రోడ్ ఛాంపియన్‌షిప్ లో పాల్గొంటారని చెప్పారు.