అక్షరటుడే, హైదరాబాద్‌: శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు అండర్‌-19 ఉమెన్‌ ప్లేయర్స్‌ త్రిష, ద్రితి కేసరి చేరుకున్నారు. ప్లేయర్స్‌కు హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. మలేషియాలో జరిగిన ICC అండర్-19 మహిళల T20 ప్రపంచ కప్ 2025లో విజయవంతంగా టైటిల్‌ను సొంతం చేసుకున్నాక వీరు ఇండియాకు చేరుకున్నారు. త్రిష 309 పరుగులతో టోర్నమెంట్‌లో అత్యధిక స్కోరర్‌గా నిలిచింది. ఏడు వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా ఎంపికైంది.