ధాన్యం కొనుగోలు కేంద్రo ప్రారంభo

0

అక్షరటుడే,భీంగల్ : భీమ్ గల్ మండలం ముచ్కూర్ సొసైటీ ఆధ్వర్యంలో, ముచ్కూర్, పిప్రి బాసన్పల్లి, పల్లికొండ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం కమ్మర్‌పల్లి వ్యవసాయ మార్కెట్‌ ఛైర్మన్‌ పాలేపు నరసయ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్‌ సుంకేట బుచ్చన్న , ముచ్కూర్ పీఏసీఎస్ ఛైర్మన్‌ దేవేందర్, వైస్ ఛైర్మన్‌ గంగారెడ్డి, వివిధ గ్రామాల సొసైటీ డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.