నిజాంసాగర్, అక్షరటుడే: అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో గురువారం నిజాంసాగర్ మండల కేంద్రంలోని చంద్రమౌళీశ్వర ఆలయంలో అయ్యప్ప శరణు ఘోషతో ఇరుముడి కార్యక్రమం అంగరంగ వైభవంగా కొనసాగింది. గురుస్వాములు సంగమేశ్వర్ గౌడ్, అమర్ సింగ్ ఆధ్వర్యంలో ఇరుముడి కార్యక్రమం నిర్వహించారు. పడిపూజ అనంతరం 18 సార్లు మాల వేసిన సురేష్ గౌడ్ గురుస్వామిని సన్మానించారు. అనంతరం వేద పండితులు సంజీవరావు గురుస్వామితో పాటు అన్నదాన కార్యక్రమానికి సహకరించిన భక్తులను సన్మానించారు. అనంతరం స్వాములను శబరిమలకు సాగనంపారు. కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు ప్రతాప్ స్వామి, దిలీప్ రెడ్డి స్వామి, కిషోర్ స్వామి, శ్యామ్ సుందర్ స్వామి ఉన్నారు.