అక్షరటుడే, కామారెడ్డి: ధర్మసమాజ్ పార్టీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ధర్మ సమాజ్ పార్టీ కామారెడ్డి జిల్లా కన్వీనర్ బోలెశ్వర్ మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారత రాజ్యాంగాన్ని అమలు చేయడంలో విఫలమవుతున్నాయన్నారు. కార్యక్రమంలో నాయకులు అరవింద్, రాజు, కవిన్, సత్యం, భూమన్న, బీసీ నాయకులు సిద్ధరాములు, శివరాములు, రాజయ్య, మల్లన్న తదితరులు పాల్గొన్నారు.