అక్షరటుడే, బోధన్: పట్టణ శివారులోని పసుపు వాగులో పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. గురువారం వాగులో వ్యక్తి మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ సీఐ వెంకట్ నారాయణ తెలిపారు.