అక్షరటుడే, న్యూఢిల్లీ: IIT, IISC లోని పరిశోధకులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీపి కబురు అందించింది. పరిశోధనలు చేసే 10 వేల మందికి ఫెలోషిప్స్‌ ప్రకటించింది. దేశంలో 23 ఐఐటీలు ఉన్నాయి. వీటిల్లో 10 వేలకు పైగా పీహెచ్డీ సీట్లు ఉండగా.. బెంగళూరులోని IISC లో 250 పీహెచ్డీ సీట్లు ఉన్నాయి. తాజా నిర్ణయంతో వీటిలో చదివే వారికి లబ్ధి చేకూరనుంది.

అటల్​ టింకరింగ్​ ల్యాబ్స్​

బడ్జెట్​లో విద్యారంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. ఐదేళ్లలో 50 వేల పాఠశాలల్లో అటల్​ టింకరింగ్​ ల్యాబ్స్​ ఏర్పాటు చేస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించారు. వీటి ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందేలా చర్యలు చేపట్టనుంది.